కావలసిన పదార్థాలు :
మైదా... ఒకటిన్నర కప్పు
టూటీ ఫ్రూటీ... 25 గ్రా.
పంచదార... రెండు కప్పులు
వెన్న... ఒక కప్పు
చల్లటి నీళ్లు... ఒకటిన్నర కప్పు
కోకో పౌడర్... అరకప్పు
ఎండుకొబ్బరిపొడి... అరకప్పు
గింజలు తీసిన ఎండు ఖర్జూరం... అరకప్పు
గుడ్లు... రెండు
జీడిపప్పు... 25 గ్రా.
ఎండుద్రాక్ష... 25 గ్రా.
వెనీలా ఎసెన్స్... ఒక టీ.
యాలకులపొడి... పావు టీ.
బేకింగ్ పౌడర్... పావు టీ.
తయారీ విధానం :
ఒక పాత్రలో పంచదార, వెన్న, నీళ్లు, వెనీలా ఎసెన్స్, యాలకుల పొడి, బేకింగ్ పౌడర్, గుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే మైదా, కోకోపొడి వేసి మరో పదినిముషాలపాటు స్పూనుతో బాగా గిలకొట్టి, ఆ తరువాత ఎండుకొబ్బరిపొడి, ఎండు ఖర్జూరాలు, ఎండుద్రాక్ష, జీడిపప్పు, టూటీ ఫ్రూటీ వేసి బాగా కలపాలి.
కుక్కర్‌లో పెట్టే పాత్రకు వెన్న లేదా నూనె రాసి అందులో పై మిశ్రమాన్ని పోసి.. కుక్కర్ మూతలో గ్యాస్కెట్ తీసివేసి మూతపెట్టి, స్టవ్‌పై ఉడికించాలి. సన్నటి మంటమీద పావుగంట ఉడికించిన తరువాత మూత తీసి, చాకుతో గుచ్చి చూస్తే.. వంటకం అతుక్కుంటున్నట్లయితే మరో పదినిమిషాలపాటు ఉడికించాలి.
ఉడికిన తరువాత ఈ పదార్థాన్ని సర్వింగ్ డిష్‌లోకి తీసుకుని కావాల్సిన సైజులో ముక్కలు చేసి, ఇష్టమైన వాటితో అలంకరించి అతిథులకు వడ్డించండి. అంతే టూటీ ఫ్రూటీ బ్రౌనీ బైట్స్ సిద్ధమైనట్లే..!