జిల్ జిల్గా "వెజిటబుల్ జెల్లీ స్లైస్"
కావలసిన పదార్థాలు :క్యారట్.. పావు కేజీపాలకూర.. నాలుగు కట్టలుజిలాటిన్.. రెండు టీ.ఉప్పు.. తగినంతమిరియాల పొడి.. చిటికెడుజాజికాయ పొడి.. చిటికెడుతయారీ విధానం :క్యారెట్ తొక్క తీసి సన్నగా తరిగి, మిక్సీలో వేసి గుజ్జులా చేయాలి. పాలకూరని కడిగి శుభ్రం చేసి ఉడికించి, మెత్తగా గ్రైండ్ చేయాలి. చిన్న గిన్నెలో జెలాటిన్ను వేసి కొద్దిగా నీళ్లు పోయాలి. తరువాత ఈ గిన్నెను వేడినీళ్లలో ఉంచి కరిగించాలి. ఇందులోనే సగం క్యారెట్ గుజ్జులోనూ మిగిలిన సగం పాలకూర గుజ్జులోనూ వేసి కలపాలి.ఆ తరవాత ఉప్పు, మిరియాలపొడి, జాజికాయ పొడి వేసి కలపాలి. బేకింగ్ టిన్ తీసుకుని నూనె పూసి, మొదట పాలకూర గుజ్జుని పోసి 20 నిమిషాలపాటు ఫ్రిజ్లో ఉంచాలి. ఆపై మిగిలిన క్యారెట్ గుజ్జును అందులో పోసి మళ్లీ ఫ్రిజ్లో 30 నిమిషాలపాటు పెట్టాలి. ఈ గుజ్జు బాగా గట్టిపడ్డాక బయటకు తీసి ప్లేటులో తిరగవేసే, సన్నని ముక్కలుగా కోసి సర్వ్ చేయాలి.