Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జామకాయల జెల్లీ

జామకాయల జెల్లీ
కావలసిన పదార్థాలు :
దోర జామకాయలు... కిలో
పంచదార... ముప్పావు కిలో
సిట్రిక్‌ ఆమ్లం... 5 గ్రాములు
లెమన్‌ ఎల్లో ఫుడ్‌ కలర్... చిటికెడు

తయారీ విధానం :
జామకాయల పైనుండే తొక్క తీసేసి సన్నని ముక్కలుగా తరగాలి. ముక్కల్లో లీటరు నీళ్లు పోసి 25 నిమిషాలు ఉడికించాలి. తరవాత దించి చల్లారాక సన్నని బట్టలో వడగట్టి జ్యూస్‌లా తీయాలి. బట్టలో ఉన్న పిప్పిని తీసేయాలి. ఈ జ్యూస్‌ని కొలిస్తే, సుమారుగా 3 గ్లాసులు వస్తుంది. ఇందులో గుజ్జుగానీ విత్తులుగానీ లేకుండా చూసుకోవాలి.

వెడల్పాటి గిన్నెలో జామకాయల జ్యూస్‌ పోసి అందులో ఈ చక్కెర వేసి చిక్కని పాకం వచ్చేవరకూ ఉడికించాలి. తరువాత కొద్ది నీళ్లలో కలిపిన సిట్రిక్‌యాసిడ్‌ను ఈ పాకంలో కలిపి మరో రెండు నిమిషాలు ఉడికించి దించాలి. తడిలేని జామ్‌ బాటిల్‌లో ఈ మిశ్రమాన్ని వేసి చల్లారిన తరవాత మూతపెడితే గోవా జెల్లీ రెడీ. దీన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు బ్రెడ్‌తో కలిపి తినవచ్చు.

Share this Story:

Follow Webdunia telugu