"ఖాస్తా రోటీ" సాస్‌తో తింటుంటే మజా మజా..!!
కావలసిన పదార్థాలు :మైదా పిండి.. ఒక కేజీపాలు... వంద ఎం.ఎల్.రవ్వ.. 70 గ్రా.ఉప్పు.. తగినంతపంచదార.. రెండు టీ.బేకింగ్ పౌడర్.. ఒక టీ.నెయ్యి.. వంద గ్రా.తయారీ విధానం :మైదాపిండిలో బేకింగ్ పౌడర్ కలిపి పిండిని జల్లించుకోవాలి. పాలు, రవ్వ, పంచదార, ఉప్పు వేసి మైదాపిండిని మృదువుగా కలుపుకోవాలి. పిండిపై తడిబట్ట కప్పి దానిని కనీసం అరగంటసేపు అలాగే ఉంచేయాలి. తరువాత పిండి నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని నిమ్మకాయల సైజులో ఉండలు చేసి, పొడవుగా చపాతీల్లాగా వత్తి గుండ్రంగా చుట్టాలి.తరువాత వీటిని మళ్లీ రోటీల మాదిరిగా వత్తి నెయ్యి వేస్తూ రెండువైపులా ఎర్రగా కాల్చాలి. దానిని పెనంపైనుంచి తీసేటప్పుడు కూడా నెయ్యి రాసి తీసేయాలి. రొటీన్‌గా చేసే చపాతీలకు బదులుగా ఇలాంటి రోటీలు చేసి సాస్‌తోగానీ, కూరతోగానీ సర్వ్ చేస్తే చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తింటారు.