కావలసిన పదార్థాలు : క్యాప్సికమ్... అర కేజీ ఉల్లిపాయలు.. నాలుగు శనగపిండి... అరకప్పు పచ్చిమిర్చి... ఎనిమిది నూనె.. రెండు టీ. ఉప్పు... తగినంత పసుపు.. అర టీ. కొత్తిమీర... ఒక కట్ట
పోపుకోసం... ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు... తగినంత
తయారీ విధానం : క్యాప్సికమ్‌కు తొడిమలు తీసివేసి, అంగుళం సైజు ముక్కలుగా తరగాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చిలను సన్నగా తరగాలి. బాణలిలో నూనెవేసి కాగిన తరువాత పోపు దినుసులన్నింటినీ వేసి వేయించి.. ఉల్లి, మిర్చి ముక్కలను వేయాలి. అవి దోరగా వేగిన తరువాత క్యాప్సికమ్ ముక్కలు, పసుపు, ఉప్పు కలిపి మూతపెట్టి సన్నటి మంటమీద మగ్గనివ్వాలి.
ముక్కలు మెత్తబడిన తరువాత శనగపిండి చల్లి కలిపి, పిండిలో పచ్చివాసన పోయేదాకా వేయించి, చివర్లో సన్నగా తరిగిన కొత్తిమీర చల్లి దించేసి వేడి వేడిగా సర్వ్ చేయాలి. అంతే రుచికరమైన క్యాప్సికమ్ బేసన్ ఫ్రై తయారైనట్లే...!