కావలసిన పదార్థాలు :
కోకో పౌడర్... వంద గ్రా.
మైదా... 300 గ్రా.
వెన్న... 200 గ్రా.
పంచదార... 200 గ్రా.
చిక్కటి పాలు... రెండు కప్పులు
బీట్‌రూట్ పేస్ట్... ఒక కప్పు
మరిగించిన నీళ్లు... ఒక కప్పు
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
వెనిల్లా ఎసెన్స్... రెండు టీ.
యాలక్కాయలపొడి.. అర టీ.
సోడా బై కార్బ్... అర టీ.
బేకింగ్ పౌడర్... అర టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
కోకోపొడిని వేడినీటిలో కరిగించి పేస్టులా కలపాలి. మైదాలో బేకింగ్ పౌడర్, సోడా బైకార్బ్, ఉప్పు, యాలకుల పొడి, కార్న్‌ఫ్లోర్ వేసి కలిపి జల్లించాలి. వెన్నలో పంచదార, వెనిల్లా ఎసెన్స్ వేసి స్పూనుతో గిలకొట్టి.. మైదా మిశ్రమం, కోకో ముద్ద, పాలు, బీట్‌రూట్ ముద్ద వేసి తగినన్ని నీళ్లు పోసి మరికాసేపు గిలకొట్టాలి.
కుక్కర్ గిన్నెలో తగినన్ని నీళ్లు పోసి అందులో వేరే గిన్నె బోర్లించాలి. దానిమీద అడుగున నూనె లేదా వెన్న పూసి కోకో మిశ్రమాన్ని సర్దిన గిన్నెను ఉంచాలి. వెయిట్ పెట్టకుండా 15 నిమిషాలు ఆవిరిమీద ఉడికించి తీయాలి. పాత్ర వేడిగా ఉండగానే ప్లేటులోకి బోర్లించి వెనుక తడితే అచ్చులా ఊడివస్తుంది. అంతే కోకో చాక్లెట్ విత్ బీట్‌రూట్ రెడీ. దీన్ని చాకుతో కావాల్సిన సైజులో ముక్కలుగా చేసి తినవచ్చు. అవసరం అనుకునేవాళ్లు కస్టర్డ్ సాస్ లేదా క్రీమ్ సాస్ కూడా వీటికి కలుపుకుని తినవచ్చు.