కావలసిన పదార్థాలు :
ఆరెంజ్ పండ్లు... రెండు
దానిమ్మపండ్లు... నాలుగు
పంచదార... పది టీ.
చల్లటి నీరు... 200 గ్రా.
తయారీ విధానం :
ఆరెంజ్ పండ్లు పై తొక్క తీసి, తొనలను విడదీసి, వాటిల్లో గింజలు లేకుండా తీసివేయాలి. దానిమ్మ పై తొక్క తీసి గింజల్ని ఒలుచుకోవాలి. ఆరెంజ్ తొనలు, దానిమ్మ గింజలు, చల్లటి నీరు కలిపి మిక్సర్‌లో వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని ఓ పాత్రలోకి వంపి ఫ్రిజ్‌లో ఉంచి, చల్లబడ్డాక గ్లాసుల్లో పోసి సర్వ్ చేయాలి.
ఈ జ్యూస్‌లో ప్రోటీన్లు, విటమిన్ 'సి', కాల్షియం, ఐరన్ సమృద్ధిగా ఉండటంవల్ల ఇది అన్ని వయసులవారికీ మేలు చేస్తుంది. కొవ్వు పదార్థాలు ఏ మాత్రం లేకపోవడంతో ఊబకాయులకు ఇది దివ్యౌషధంగా పనిచేస్తుంది. ఇందులోని కాల్షియం ఎముకల బలానికి ఎంతగానో ఉపయోగపడుతుంది. రోగ నిరోధక వ్యవస్థను విటమిన్ 'సి' శక్తివంతం చేస్తుంది. ఫలితంగా ఎన్నో రకాల ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.