ఆలూ స్పెషల్ "పాంచ్ పూర్నర్ చార్ చారి"
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు.. పావు కేజీవంకాయలు.. నాలుగుగుమ్మడికాయ.. చిన్న ముక్కబీన్స్.. పావు కేజీలో సగంపచ్చిమిరపకాయలు... ఐదుఆవాలు, జీలకర్ర, మెంతులు.. పోపుకు సరిపడాఎండుమిర్చి.. ఒకటికరివేపాకు.. రెండు రెబ్బలుపంచదార.. చిటికెడునూనె.. సరిపడాతయారీ విధానం :గుమ్మడికాయ, బంగాళాదుంపల తొక్కతీసి చిన్నచిన్న ముక్కలుగా కోయాలి. వంకాయల్ని చిన్నచిన్న ముక్కలుగా కోసి అవి కండ్ర ఎక్కకుండా నీళ్లలో వేయాలి. బీన్స్ కూడా కడిగి చిన్న ముక్కలుగా కోయాలి. బాణలిలో నూనె వేసి జీలకర్ర, ఆవాలు.. తదితర పోపు సామానంతా వేసి అవి చిటపటమన్నాక సన్నగా చీల్చిన పచ్చిమిర్చి వేయాలి.పచ్చిమిర్చి వేగిన తరువాత కూరగాయల ముక్కలన్నీ వేసి కాస్త మగ్గనివ్వాలి. ఆపై ఉప్పు, పంచదార కూడా వేసి తగినన్ని నీళ్లు పోసి... సన్నటి సెగమీద నీళ్లన్నీ ఇంకేవరకూ ఉడికించి దించేయాలి. అంతే పాంచ్ పూర్నర్ చార్ చారి రెడీ..!!