అతిథుల కోసం వెరైటీ డిష్ "ఆచర్ కె ఆలూ"
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు... ముప్పావు కిలోఉల్లిపాయలు... ఐదుఅల్లం, వెల్లుల్లి పేస్ట్... మూడు టీ.కారం... ఒకటిన్నర టీ.పసుపు... అర టీ.వెనిగర్... ముప్పావు కప్పుపంచదార... రెండు టీ.నూనె... సరిపడాఉప్పు... తగినంతతాలింపుకోసం ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి... తగినన్నితయారీ విధానం :బంగాళాదుంపల్ని ఉడికించి తొక్క తీసి మీడియంసైజు ముక్కలుగా కోసుకోవాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనె వేసి వేడిచేసి దుంపలు బంగారువర్ణంలోకి వచ్చేవరకూ డీప్ ఫ్రై చేసి పక్కన ఉంచాలి. తరువాత బాణలిలోని నూనె కొద్దిగా ఉంచి మిగిలినది వేరేదాంట్లోకి వంపాలి. ఇప్పుడు బాణలిలో ఉల్లిపాయ ముక్కలు వేయాలి.అవి వేగాక అల్లం, వెల్లుల్లి, ఉప్పు, పసుపు, కారం, బంగాళాదుంప ముక్కలు కూడా వేసి వేయించాలి. అందులోనే అరకప్పు నీళ్లు పోసి తక్కువ మంటమీద కొద్దిగా గ్రేవీ ఉండేంతవరకూ ఉడికించి దించాలి. వినెగర్‌లో పంచదార కలిపి ఈమిశ్రమాన్ని కూడా కూరలో కలపాలి. మరో బాణలిలో కొద్దిగా నూనె వేసి పోపు గింజలు వేసి అవి చిటపటమన్నాక తీసి కూరలో కలిపితే సరి...!