కావలసిన పదార్థాలు :
నూడుల్స్... కప్పు
నూనె... 2 టీ.
ఉల్లిపాయ ముక్కలు... అరకప్పు
పెరుగు... ముప్పావు కప్పు
వరిపిండి... ఒక టీ.
బ్లాక్‌సాల్ట్... అరటీ.
పసుపు... అరటీ.
ఆవాలు... పావు టీ.
కారం... అర టీ.
జీలకర్ర... ఒక టీ.
మెంతులు... అర టీ.
ఎండుమామిడి పొడి... అర టీ.
అల్లం వెల్లుల్లి... ఒక టీ.
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
నూడుల్స్‌ను ఉడికించి ఉంచాలి. నాన్‌స్టిక్ పాన్‌ను వేడిచేసి నూనె వేసి కాగాక మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తరవాత ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెంసేపు వేయించాలి. అల్లంవెల్లుల్లి, ఉప్పు, పసుపు, ఎండుమామిడికాయ పొడి అన్నీ వేసి కలపాలి. తరవాత వరిపిండి, పెరుగు, బ్లాక్‌సాల్ట్, కారం వేసి కలిపి కొద్దిసేపు ఉడికించి నూడుల్స్ వేసి బాగా కలిపి దించాలి.