కావలసిన పదార్థాలు :
ముద్దగా ఉడికించిన అన్నం.... మూడు కప్పులు
సన్నగా తరిగిన పచ్చిమిర్చి... రెండు
ఉల్లిపాయ... ఒకటి
టేస్టింగ్ సాల్ట్... తగినంత
గుడ్లు... రెండు
కొత్తిమీర తరుగు... కొద్దిగా
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
స్టవ్‌మీద బాణలి పెట్టి... అందులో ఉడికించిన అన్నంతోపాటు.. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, టేస్టింగ్ సాల్ట్, బాగా గిలకొట్టిన గుడ్డు మిశ్రమం, కొత్తిమీర తరుగు వేసి ముద్దగా చేయాలి. ఓ వెడల్పాటి ప్లేటు తీసుకుని నెయ్యి రాసి అన్నం ముద్దని అందులో వేసి అంగుళంన్నర ఎత్తులో అట్లకాడతో సమంగా సర్దాలి.
ఆరిన తరవాత వీటిని కావలసిన ఆకారంలో కోయాలి. స్టవ్‌మీద బాణలి పెట్టి నూనెపోసి కాగాక కోసిన కేకుల్ని వేసి బంగారువర్ణంలోకి వచ్చేవరకూ వేయించి తీయాలి. అంతే రైస్ ఎగ్ కేక్స్ తయారైనట్లే..! కరకరలాడుతూ ఉండే ఈ రైస్ కేకుల్ని పిల్లలు ఇష్టంగా తింటారు.