కావలసిన పదార్థాలు :
సన్నగా తరిగిన బ్రొకోలి... రెండు కప్పులు
పాలు... నాలుగు కప్పులు
మైదా... రెండు టీ.
బటర్... రెండు టీ.
వెల్లుల్లి... రెండు రెబ్బలు
సన్నగా తరిగిన ఉల్లిపాయలు... రెండు టీ.
ఉప్పు, మిరియాల పొడి... రుచికి సరిపడా
తయారీ విధానం :
సాస్పాన్ని వేడిచేసి బటర్ వేసి కరిగించాలి. అందులో సన్నగా తరిగిన వెల్లుల్లి, ఉల్లిపాయలను వేసి వేయించాలి. తరువాత మైదాపిండి కూడా వేసి సన్నటి మంటపై ముదురురంగు వచ్చేదాకా వేయించాలి. దాంట్లోనే బ్రొకోలి ముక్కలు వేసి కలపి కాసేపు వేయించాక పాలుపోసి కలిపి మరగనివ్వాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, మిరియాలపొడిని కలపాలి. ఈ సూప్‌ను స్టవ్ నుంచి దించేశాక కప్పులో పోసి బ్రొకోలి ముక్కతో గార్నిష్ చేసి, బ్రెడ్‌తో సర్వ్ చేయాలి. అంతే వేడి వేడి బ్రొకోలి సూప్ తయారైనట్ల్...!
ఈ సూప్ ద్వారా ఫోలిక్‌యాసిడ్, కాల్షియం, పీచుపదార్థాలు, విటమిన్ ఎ, సిలు సమృద్ధిగా లభిస్తాయి. బ్రొకోలీలో ఉండే పోషకాలు కంటి శుక్లాల సమస్యలను దరిచేరనివ్వవు. ఫోలిక్ యాసిడ్ గర్భవతులకు మంచిది. ఇందులోని పొటాషియం రక్తపోటును క్రమబద్ధీకరిస్తుంది. కాల్షియం అస్టియోపోరాసిస్ లాంటి సమస్యలను దూరం చేస్తుంది. పీచు పదార్థాలు ఎక్కువగా ఉండటంవల్ల జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.