"ముర్గ్ అద్రకీకి కబాబ్" విత్ మస్ట్రడ్ ఆయిల్
కావలసిన పదార్థాలు :ఎముకలు లేని కోడి మాంసం... అర కేజీఅల్లం... 50 గ్రాములుగడ్డ పెరుగు... అర కప్పుగరంమసాలా పొడి... అర టీ.జీరా పొడి... అర టీస్పూన్కస్తూరి మేతి పొడి... అర టీ.నల్ల ఉప్పు... అర టీ.మిర్చిపొడి... 1 టీ.అల్లం వెల్లుల్లి ముద్ద... అర టీ.ఆవనూనె... 20 గ్రా.తయారీ విధానం :చికెన్‌ను శుభ్రపర్చి, మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి. అల్లం కొమ్మును స్లైసులుగా కట్ చేసుకోవాలి. చికెన్ ముక్కలు, అల్లం స్లైసులు, పైన చెప్పుకున్న మసాలాల మిశ్రమాన్ని కలిపి అరగంటసేపు నానబెట్టాలి.అల్లం ముక్కలు, చికెన్ ముక్కల్ని వరుసగా సీకుకు గుచ్చి తందూరి లేదా ఓవెన్లో 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో 10 నిమిషాలపాటు ఉడికించాలి. అంతే ముర్గ్ అద్రకీకి కబాబ్ రెడీ. దీన్ని వేడిగా ఉన్నప్పుడే పుదీనా చట్నీతో కలిసి తింటే చాలా బాగుంటుంది.