Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మిక్సింగ్ వెజిటబుల్స్ స్పెషల్ "వెజ్‌ సూప్‌"

మిక్సింగ్ వెజిటబుల్స్ స్పెషల్
కావలసిన పదార్థాలు :
క్యాబేజీ, క్యారెట్‌, క్యాప్సికమ్‌, ఉల్లి, టొమాటో ముక్కలు... ఒక్కో కప్పు చొప్పున
వెల్లుల్లి... రెండు పాయలు
ఆలీవ్ నూనె... మూడు టీ.
మాకరోని... 30 గ్రా.
ఉప్పు... తగినంత
ఛీజ్.... 25 గ్రా.
మిరియాలపొడి... పావు టీ.

తయారీ విధానం :
ముందుగా క్యాబేజీని ఆకులుగా విడదీసి అంగుళం సైజు ముక్కలుగా కోయాలి. ఇదేమాదిరిగా అన్ని కూరగాయల్నీ ముక్కలుగా కోయాలి. వెల్లుల్లిని కూడా సన్నగా తరిగి ఉంచాలి. ఓ గిన్నెలో ఆలివ్‌ ఆయిల్‌ వేసి వెల్లుల్లి, తరువాత టొమాటో తప్ప మిగిలిన కూరగాయ ముక్కలు వేసి కొద్దిగా వేయించి, 4 గ్లాసులు నీళ్లు పోసి ఉడికించాలి.

కూరలు బాగా మెత్తగా ఉడికాయి అనుకున్న తరువాత మాకరోని, టొమాటో ముక్కలు వేసి బాగా ఉడికించాలి. చివరగా ఉప్పు సరిచూసి మిరియాలపొడి, ఛీజ్‌ తురుము కలిపి వేడిగా వడ్డించాలి. అంతే వెజ్ సూప్ రెడీ అయినట్లే..!

Share this Story:

Follow Webdunia telugu