కావలసిన పదార్థాలు :
గోధుమపిండి... అరకేజీ
వరిపిండి... 200 గ్రా.
కొత్తిమీర... నాలుగు కట్టలు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
ఉల్లిపాయలు... రెండు
కారం... రెండు టీ.
గరంమసాలా... రెండు టీ.
పసుపు... ఒక టీ.
సెనగపప్పు... నాలుగు టీ.
నూనె... వేయించేందుకు సరిపడా
ఉప్పు... తగినంత
తయారీ విధానం :
గోధుమపిండిలో వరిపిండి కలిపి... తురిమిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉల్లిపాయ తరుగు, గరంమసాలా, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. తగినన్ని నీళ్లు, కొద్దిగా నూనె వేసి గట్టిగా పిండిముద్దలా కలపాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దల్లా చేసుకోవాలి.
అరచేతులకు కొద్దిగా నూనె రాసి చేతుల మీదే చెక్కల మాదిరిగా వత్తి, రెండు గంటలపాటు నానబెట్టిన సెనగపప్పును రెండువైపులా అద్ది స్పూనుతో సన్నగా గాట్లలాగా పెట్టి.. మరుగుతున్న నూనెలో వేసి, ఎర్రగా కాల్చి తీసేయాలి. అంతే మాణిక్ వీట్ పెయిన్ జాన్ రెడీ అయినట్లే...! వీటిని అలాగేకానీ, టొమాటోసాస్ లేదా ఏదైనా చట్నీతోగానీ కలుపుకుని తినవచ్చు.