"మష్రూమ్స్ మెలాంజ్" మస్త్ టేస్టీ..!!
కావలసిన పదార్థాలు :మెలాంజ్... పావు కేజీపుట్టగొడుగులు... వంద గ్రా.పసుపు.. పావు టీ.పచ్చిమిర్చి.. ఐదుపెరుగు.. 50 గ్రా.జీలకర్ర పొడి.. రెండు టీ.గరంమసాలా... రెండు టీ.అల్లంవెల్లుల్లి... మూడు టీ.సోయాసాస్.. పది మి.లీ.నూనె.. గరిటెడుఉప్పు... తగినంతయాపిల్.. ఒకటిసాస్కోసం... యాపిల్.. ఒకటివెన్న.. మూడు టీ.దాల్చిన చెక్క.. చిన్నదిపంచదార.. ఒక టీ.తయారీ విధానం :మసాలా దినుసులన్నీ పొడిలా చేయాలి. పచ్చిమిర్చిని విడిగా నూరాలి. మసాలా పొడిలో పచ్చిమిర్చి, అల్లంవెల్లుల్లి ముద్దలు, పెరుగు వేసి బాగా కలపాలి. మెలాంజ్ను చిన్న ముక్కలుగా కోసి మసాలా ముద్దలో నానబెట్టాలి. పుట్టగొడుగుల్ని శుభ్రంగా కడిగి ముక్కలుగా తరగి, బాణలిలో నూనె వేసి వేయించాలి. అందులోనే సోయాసాస్ కూడా వేసి వేయించి, చివర్లో మెలాంజ్ ముక్కల్ని కూడా వేసి గోధుమరంగులోకి వచ్చేదాకా ఉడికించాలి.సాస్కోసం : యాపిల్ తొక్క తీసి అందులోని విత్తుల్ని కూడా తీసేయాలి. దాల్చినచెక్కతో కలిపి మెత్తగా ఉడికించాలి. దీన్ని ఓ పాన్లోకి వంపి కొద్దిగా వెన్న వేసి తక్కువ మంటమీద ఐదు నిమిషాలు ఉడికించి మష్రూమ్ మెలాంజ్తో కలిపి వేడివేడిగా వడ్డించాలి.