బీరకాయతో "తూరియా పొస్టా చార్ చారి"
కావలసిన పదార్థాలు :బీరకాయలు (తూరియా).. పావు కేజీగసగసాలు.. 75 గ్రా.బంగాళాదుంపలు.. 150 గ్రా.పంచదార.. చిటికెడుమినప్పప్పు.. రెండు టీ.పచ్చిమిరపకాయలు.. రెండుఅల్లం.. చిన్న ముక్కపసుపు.. అర టీ.ఉప్పు.. తగినంతకారం.. అర టీ.నూనె.. గరిటెడుతయారీ విధానం :బీరకాయల తొక్క తీసి చిన్న చిన్న ముక్కలుగా కోయాలి. గసగసాలు నానబెట్టి మెత్తగా రుబ్బి పెట్టుకోవాలి. బంగాళాదుంపలు తొక్క తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి పెట్టుకోవాలి. ఓ బాణలిలో నూనె వేసి వేడి చేసి జీలకర్ర, మినప్పప్పు వేసి అవి కాస్త చిటపటమన్నాక సన్నగా తరిగిన అల్లం, పచ్చిమిర్చి వేసి కూరగాయ ముక్కలు కూడా వేసి వేయించాలి.ముక్కలు కొద్దిగా మగ్గిన తరవాత ఉప్పు, కారం అన్నీ వేసి కలిపి కొద్దిగా నీళ్లు కూడా పోసి ఉడికించాలి. కూర బాగా ఉడికిందనుకున్న తరవాత గసాలముద్ద వేసి కొద్దిగా నెయ్యి కూడా జోడిస్తే నోరూరించే తూరియా పొస్టా చార్ చారి తయారైనట్లే..! ఇది వేడి అన్నంలోకి, దోశెల్లోకి, చపాతీల్లోకి చాలా రుచిగా ఉంటుంది.