Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

బనానా బటర్ ఫుడ్డింగ్

బనానా బటర్ ఫుడ్డింగ్
కావలసిన పదార్థాలు :
వెన్న... 60 గ్రా.
పంచదార... 60 గ్రా.
గోధుమపిండి... 60 గ్రా.
అరటి పండ్లు... 2
పాలు... 3/4 కప్పు
గుడ్లు... 2

తయారీ విధానం :
ముందుగా గోధుమపిండిలో పంచదార, వెన్న వేసి బాగా కలిపి, అందులోనే పాలు పోసి మధ్యస్థంగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని సన్నటిసెగపై చిక్కగా ఉడకనివ్వాలి. గుడ్లు పగులగొట్టి, పచ్చసొనను విడిగా తీయాలి. ఉడికించిన పిండిలో దించిన తరువాత పచ్చసొనను కలిపి, బాగా చిలకాలి.

దీంట్లోనే అరటిపండ్ల ముక్కలు తరిగి కలపాలి. బేకింగ్ టిన్‌లో ఈ మిశ్రమాన్ని పోసి 20 నిమిషాలపాటు ఉడికించాలి. తరువాత గుడ్లలోని తెల్లసొన, ఒక టీస్పూన్ పంచదారపొడి కలిపి ఒక పాత్రలో వేసి బాగా చిలికి ఫుడ్డింగ్ పైన పోసి, గోధుమరంగు వచ్చేదాకా మళ్లీ ఉడికించాలి. అంతే బనానా బటర్ ఫుడ్డింగ్ రెడీ అయినట్లే..!

Share this Story:

Follow Webdunia telugu