Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఫ్రెంచ్ టోస్ట్ విత్ బటర్

ఫ్రెంచ్ టోస్ట్ విత్ బటర్
కావలసిన పదార్థాలు :
బ్రౌన్ బ్రెడ్ స్లయిసెస్.... నాలుగు
పాలు... 200 ఎం.ఎల్.
పంచదార... 40 గ్రా.
కోడిగుడ్లు... రెండు
కరిగించిన బటర్... వంద గ్రా.

తయారీ విధానం :
ఒక పాత్రలో పాలు, పంచదార, కోడిగుడ్లు కలిపి గిలక్కొట్టాలి. ఆ తరువాత పాన్‌మీద బటర్ వేసి బ్రెడ్‌ను రెండువైపులా వేయించుకోవాలి. చివరగా కలిపి ఉంచుకున్న పాల మిశ్రమాన్ని బ్రెడ్ మీద పోసి రెండువైపులా మళ్లీ కాల్చాలి. అంతే ప్రెంచ్ బటర్ టోస్ట్ విత్ బటర్ రెడీ అయినట్లే...!

ఈ వంటకంలో ప్లెయిన్ బ్రెడ్ కంటే బ్రౌన్ బ్రెడ్ వాడటం ఆరోగ్యానికి మంచిది. పిల్లలు బ్రౌన్ బ్రెడ్ ఇష్టపడకపోతే, వాళ్లకు ఈ రకంగా ఫ్రెంచ్ టోస్ట్ చేసిపెట్టవచ్చు. బ్రెడ్‌ను పాల మిశ్రమంలో ముంచి కూడా పాన్‌పై రెండువైపులా కాల్చి ఇవ్వవచ్చు. పాలు, బటర్‌లలో ఉండే కాల్షియం ఎముకల బలానికి సహకరిస్తుంది. ఇక కోడిగుడ్డులోని బయోటిన్ చర్మ ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

Share this Story:

Follow Webdunia telugu