కావలసిన పదార్థాలు :
బంగాళాదుంపలు... నాలుగు
పాలకూర... రెండు కట్టలు
కొత్తిమీర... అర కప్పు
శెనగపప్పు... పావు కేజీపచ్చిమిరపకాయ... రెండు
గరంమసాలా పొడి... రెండు టీ.
ఉల్లిపాయ తరుగు... రెండు
అల్లం వెల్లుల్లి ముద్ద... రెండు టీ.
ఉప్పు... తగినంత
బ్రెడ్ పొడి... కట్‌లెట్స్‌కు అద్దడానికి సరిపడా
నూనె... తగినంత
తయారీ విధానం :
బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా చేయాలి. అందులో తరిగిన పాలకూర, ఉడికించి కొత్తిమీరతో కలిపి రుబ్బిన శెనగపప్పు ముద్ద, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయ తరుగు, గరంమసాలా, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు చేర్చి బాగా కలపాలి.
ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నచ్చిన ఆకారంలో అరచేతితో తట్టి, బ్రెడ్‌పొడిలో దొర్లించి, పెనం మీద వేసి వేయించాలి. నూనె రెండు వైపులా వేసి బాగా ఎర్రగా కాల్చుకోవాలి. వీటిని వేడి వేడిగా, టొమోటో సాస్‌తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి.