కావలసిన పదార్థాలు :
పనీర్... 400 గ్రా.
పంచదార పొడి... 200 గ్రా.
యాలక్కాయలు... ఒక టీ.
కొబ్బరికాయలు... రెండు
బెల్లం... 600 గ్రా.
తయారీ విధానం :
కొబ్బరిని తురిమి... ఓ బాణలిలో వేయించాలి. అందులోనే బెల్లం తురుము కూడా వేసి ఉడికించాలి. ఈ మిశ్రమం కొబ్బరి లౌజు మాదిరిగా దగ్గరకు ఉడికిన తరవాత దించి, అందులో యాలక్కాయల పొడి చల్లాలి. చల్లారిన తరవాత దీన్ని ఉండలుగా చుట్టాలి. పనీర్‌ను కూడా తురిమి, బాగా మర్దించి పిండిముద్దల్లా కలపాలి.
అందులోనే పంచదార వేసి, కలిపి చేత్తోనే చిన్న చపాతీలా చేయాలి. దాని మధ్యలో కొబ్బరి ఉండను పెట్టి అంచుల్ని మూసేసి ఉల్లిపాయ ఆకారంలో పైకి కొనలా చేయాలి. వీటిని ఆవిరిమీద ఉడికిస్తే "పనీర్ కోకోనట్ మోదక్" సిద్ధమైనట్లే..!