కావలసిన పదార్థాలు :
మీగడ పాలు... ఒక లీ.
పంచదార... నాలుగు టీ.
కస్టర్డ్ పౌడర్... నాలుగు టీ.
కోవా పాలు (కండెన్స్డ్ మిల్క్)... 120 మి.లీ.
మామిడిపండు గుజ్జు... రెండు కప్పులు
డ్రైఫ్రూట్స్... ఒక కప్పు
తయారీ విధానం :
కస్టర్డ్ పౌడర్‌లో చల్లటిపాలు పోసి మెత్తని పేస్టులా చేయాలి. సన్నమంటమీద పాలను మరిగించాలి. అవసరమైనప్పుడు గరిటెతో తిప్పుతూ లీటరు పాలు అరలీటరు అయ్యేవరకూ మరిగించాలి. తరవాత పంచదార వేసి, కస్టర్డ్ మిశ్రమాన్ని కూడా వేసి గరిటెతో తిప్పుతూ రెండు నిమిషాలు ఉడికించి దించాలి.
మిశ్రమం బాగా చల్లారాక వేరే పాత్రలో పోసి ఫ్రిజ్‌లో పెట్టాలి. బాగా చల్లబడిన తరువాత అందులో కండెన్స్డ్ మిల్క్, మామిడిపండు గుజ్జు కూడా వేసి బాగా కలిపి మరికాసేపు ఫ్రిజ్‌లో పెట్టి తీస్తే, ఫ్రూట్ మెలాంజ్ సిద్ధమైనట్లే..! చివరగా దీన్ని డ్రైఫ్రూట్స్‌తో అలంకరించి అతిథులకు సర్వ్ చేయాలి.