చెన్నయ్‌లో అతిపెద్ద 'పిజ్జా': లింకా రికార్డు బద్ధలు
తమిళనాడు రాష్ట్ర రాజధాని చెన్నయ్‌లో అతిపెద్ద పిజ్జా రూపుదిద్దుకుంది. అంతర్జాతీయ పిజ్జా చైన్ గ్రూపు అయిన గ్లోబల్ ఫ్రాంచైజీ ఆర్కిటెక్స్ దీన్ని తయారు చేసింది. దేశంలోని పిజ్జా ప్రవేశించి 13 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా దీన్ని తయారు చేశారు. 140 కేజీల బరువుతో 13 అడుగుల్లో దీన్ని తయారు చేశారు. గతంలో ఈ పిజ్జా కార్నర్ పేరిట ఉన్న లింకా ఆఫ్ బుక్ రికార్డును ఆ సంస్థే బ్రేక్ చేసింది. ఇప్పటి వరకు లింకా ఆఫ్ బుక్ రికార్డుల్లో అతిపెద్ద పిజ్జాగా 12.24 అడుగుల పిజ్జా చోటు చేసుకుంది. ప్రస్తుతం దీన్ని బ్రేక్ చేస్తూ 13 అడుగుల పిజ్జాను తయారు చేశారు. దీనిపై జీఎఫ్‌ఏ ఇండియా సీఈఓ జోసఫ్ చెరియన్ మాట్లాడుతూ.. 12 సంవత్సరాల నుంచి తమ పిజ్జా కార్యకలాపాలు సజావుగా సాగుతున్నట్టు చెప్పారు. చెన్నయ్ నగర వాసులు అందిస్తున్న ప్రోత్సాహంతో మున్ముందు మెరుగైన సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. కష్టమర్లను సంతృప్తి పరిచేందుకు తాము ఎప్పటికపుడు వినూత్న కార్యక్రమాలు చేపడుతున్నట్టు తెలిపారు.