చంటిపిల్లల పోషకాహారం "ఫ్రూట్ ఫిర్నీ"
కావలసిన పదార్థాలు :పాలు.. ఒక కప్పుబియ్యం పిండి.. ఒకటిన్నర టీ.బెల్లం తరుగు.. ఒక టీ.మ్యాంగో, స్ట్రాబెర్రీ, ఎప్రికాట్, ఆపిల్లలో ఏదేని పండ్ల గుజ్జు.. 3 టీ.తయారీ విధానం :పాలను బాగా మరిగించాలి. అందులో బియ్యంపిడి, బెల్లం వేసి కలుపుతూ మరిగించాలి. దించి చల్లారనిచ్చాక అందులో పండ్ల గుజ్జు వేసి బాగా కలియబెట్టాలి. అంతే ఫ్రూట్ ఫిర్నీ సిద్ధమైనట్లే..!చంటి పిల్లలకు మంచి పోషకాహారం అయిన ఫ్రూట్ ఫిర్నీ.. మెత్తగా, రుచికరంగా ఉంటుంది కాబట్టి, పిల్లలు ఇష్టంగా తింటారు. కొంతమంది పెద్దలు కూడా కొన్ని రకాల పండ్లను, పాలను ఇష్టపడరు కాబట్టి, వారికి ఇలా తయారు చేసి ఇవ్వవచ్చు. ఈ ఫ్రూట్ ఫిర్నీలో శక్తి, ప్రొటీన్లు, విటమిన్ ఎ, క్యాల్షియం.. వంటివి సమృద్ధిగా లభిస్తాయి. ఎదిగే పిల్లలకు ఈ పోషకాలు ఎంతగానో సహాయపడతాయి కూడా...!