కావలసిన పదార్థాలు :
స్ట్రాబెర్రీలు... ఒక కప్పు
సపోటా ముక్కలు... ఒక కప్పు
పాలు.... రెండు కప్పులు
తయారీ విధానం :
స్ట్రాబెర్రీలను, సపోటా ముక్కలను పాలతోపాటు మిక్సర్లో పోసి బ్లెండ్ చేయాలి. తరువాత ఆ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి పుదీనాతో గార్నిష్ చేసి.. నచ్చినవారికి ఐస్ క్యూబ్స్ వేసి చల్లగా సర్వ్ చేయాలి. వేడినుంచి మంచి ఉపశమనాన్ని అందించే ఈ పానీయం తయారు చేయడం కూడా చాలా తేలికే...!
ఈ స్ట్రాబెర్రీ చికూ షేక్ జ్యూస్లో... క్యాలరీలు, ప్రొటీన్లు, పిండిపదార్థాలు, కొవ్వు, ఫైబర్ తదితరాలు లభిస్తాయి. అలాగే విటమిన్ సితో పాటు, విటమిన్ కె, మాంగనీస్, ఫోలిక్ యాసిడ్, పొటాషియం, రిబోఫ్లెవిన్, విటమిన్ బి5, బి6, కాపర్, ఒమేగా3 ఫ్యాటీ యాసిడ్లు... ఇలా ఎన్నో పోషకాలు కూడా ఈ జ్యూస్లో ఉన్నాయి. పాలు, సపోటా ద్వారా కాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఎముకల బలానికి తోడ్పడుతుంది.