కావలసిన పదార్థాలు :
కోడిగ్రుడ్లు... నాలుగు
కోవా.... 200 గ్రా.
వెన్న... వంద గ్రా.
యాలక్కాయలు... ఐదు
పంచదార... 200 గ్రా.
బాదంపప్పు... 20 గ్రా.
పిస్తాపప్పు... 20 గ్రా.
తయారీ విధానం :
ఒక గిన్నెలో కోడిగుడ్ల సొన వేసి బాగా గిలకొట్టాలి. అందులోనే పంచదార వేసి కరిగేదాకా బాగా గిలకొట్టాలి. తరవాత పచ్చికోవా ముద్దనీ, వెన్ననీ వేసి బాగా తిప్పాలి. తరవాత అందులోనే యాలక్కాయల పొడిని కూడా వేసి కలపాలి. ఈ మొత్తం మిశ్రమాన్ని కేకు గిన్నెలో వేసి వెన్న పూసి 160 డిగ్రీల వద్ద 20 నిమిషాలపాటు ఓవెన్‌లో బేక్ చేయాలి.
ఓవెన్ ఆఫ్ చేశాక మరో 15 నిమిషాలు ఉంచి చల్లారిన తరవాత ముక్కలుగా కోసిన బాదం, పిస్తా ముక్కలతో అలంకరించాలి. ఓవెన్ లేకపోతే కుక్కర్‌కి అడుగున వెన్న రాసి ఈ మిశ్రమాన్ని పోసి, సిమ్‌లో ఓ ఇరవై నిమిషాలు ఉంచి తీయాలి.