కావలసిన పదార్థాలు :
మైదాపిండి... ఒక కప్పు
చక్కెరపొడి... ఒక కప్పు
నెయ్యి... అర కప్పు
బేకింగ్ పౌడర్... తగినంత
తయారీ విధానం :
మైదాపిండి, చక్కెర, నెయ్యి, బేకింగ్ పౌడర్ వేసి కలిపి బిస్కెట్లలా ఒత్తుకొని మైక్రోవేవ్ ఓవెన్లో బేక్ చేయాలి. ఓవెన్ లేకపోతే ప్రెషర్ పాన్కు కాస్త నెయ్యి రాసి బేక్ చేయవచ్చు. బేక్ చేసేటపుడు, నీళ్ళు అవసరంలేదు. అలాగే గ్యాస్కెట్ పెట్టకుండా మూత పెట్టాలి. 10-15 నిముషాల బేక్ చేస్తే సరిపోతుంది.
ఈ బిస్కెట్లు మరీ ఎర్రగా కాక అడుగు కాస్త ఎర్రగా ఉంటే చాలు మృదువుగా ఉంటాయి. ఇలాగే రాగి పిండి, గోధుమపిండితో కూడా బిస్కెట్లను తయారు చేయవచ్చు. చక్కెర బదులు ఉప్పు చేరిస్తే ఉప్పు బిస్కట్లు కూడా సిద్ధమైనట్లే..!