ఆలూతో అదరహో.. "గ్రీన్ కట్‌లెట్ "
కావలసిన పదార్థాలు :బంగాళాదుంపలు.. రెండుపాలకూర.. ఒక కట్టకొత్తిమీర.. కాస్తంతశెనగపప్పు.. 150 గ్రా.పచ్చిమిర్చి.. ఒకటిగరంమసాలా.. ఒక టీ.ఉల్లిపాయ.. ఒకటిఅల్లంవెల్లుల్లి ముద్ద.. ఒక టీ.ఉప్పు.. తగినంతబ్రెడ్ పొడి.. కట్‌లెట్స్‌కు అద్దేందుకు సరిపడానూనె.. తగినంతతయారీ విధానం :బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా చేయాలి. అందులో తరిగిన పాలకూర, ఉడికించి రుబ్బిన శెనగపప్పు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి ముద్ద, ఉప్పు చేర్చి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చేసి నచ్చిన ఆకారంలో అరచేతితో తట్టి బ్రెడ్‌పొడిలో దొర్లించి, పెనం మీద వేయించాలి. నూనె వేసి రెండు వైపులా ఎర్రగా కాల్చాలి. అంతే గ్రీన్ కట్‌లెట్ తయార్..!వీటిని వేడి వేడిగా సాస్‌తో కలిపి తింటే ఎంతో రుచిగా ఉంటాయి. ఏ కూర వండినా నా కిష్టంలేదంటూ పక్కనపెట్టేసే పిల్లలు ఆలూ అంటే మాత్రం ఇష్టంగా తింటారు. అయితే ఎప్పుడూ ఒకే రకమైన వేపుడు కాకుండా బంగాళాదుంపల్ని ఇలా వెరైటీగా తయారుచేసి మీ చిన్నారులకి ఇచ్చి చూడండి.