అలర్జీలను నివారించే "పపయా స్మూతీ"
కావలసిన పదార్థాలు :బొప్పాయి ముక్కలు.. రెండున్నర కప్పులుతాజా పెరుగు... అర కప్పుఐస్ క్యూబులు.. అర కప్పుతాజా అల్లం తరుగు.. ఒక టీ.తేనె.. ఒక టీ.నిమ్మకాయలు.. రెండుతాజా పుదీనా ఆకులు.. పదితయారీ విధానం :బొప్పాయి ముక్కలు, ఐస్, పెరుగు, అల్లం, తేనె, నిమ్మరసం, జ్యూసర్లోకానీ మిక్సీలోకానీ వేసి బ్లెండ్ చేయాలి. ఈ మిశ్రమం తగు మాత్రం ద్రవంగా మారేటట్లు నీటిని చేరుస్తూ అంతా కలిసేటట్లు చేయాలి. చివరగా కొన్ని పుదీనా ఆకులను వేసి ఓసారి బ్లెండ్ చేసి సర్వ్ చేయాలి. అంతే పపయా స్మూతీ తయార్..!ఈ డ్రింక్ చిక్కగా రావాలంటే.. గంట ముందుగానే బొప్పాయి ముక్కలు ప్రిజ్‌లో ఉంచితే సరిపోతుంది. పెరట్లో పెరిగే చెట్టయిన బొప్పాయి ఎన్నో రకాల ఔషద గుణాలు కలిగి ఉందన్న సంగతి తెలిసిందే. ఇందులో కెరోటిన్, బి, సి.. విటమిన్లు, ఫైబర్ సమృద్ధిగా లభిస్తుంది. ఈ బొప్పాయి కార్టియోవాస్క్యులర్ సిస్టమ్‌ను మెరుగు పరుస్తుంది. క్యాన్సర్‌ను నిరోధిస్తుంది, పపైన్ ఎంజైమ్ ద్వారా జీర్ణక్రియ సక్రమంగా జరిగేలా చూస్తుంది. బొప్పాయికి గాయాలను మాన్పించే ఔషధంతోపాటు అలర్జీలను నివారించే గుణం కూడా కలిగి ఉంది.