కావలసిన పదార్థాలు :
ఫైనాపిల్... రెండు
మైదా... 400 గ్రా.
కోడిగుడ్లు... ఎనిమిది
వెన్న... 400 గ్రా.
లెమన్‌ఎల్లో కలర్... అర టీ.
పంచదార... 400 గ్రా.
ఫైనాఫిల్ ఎసెన్స్... 6 చుక్కలు
బేకింగ్ పౌడర్... అర టీ.
తయారీ విధానం :
ఫైనాపిల్స్‌కు చెక్కు తీసి గుండ్రటి ముక్కలుగా కోయాలి. ఇప్పుడు వీటిని కేకు గిన్నెలో అడుగున అమర్చాలి. ఓ గిన్నెలో వెన్న తీసుకుని అందులో పొడి చేసిన పంచదార వేసి బాగా గిలకొట్టాలి. తరువాత కోడిగుడ్లను కూడా వేసి మళ్లీ గిలకొట్టాలి. ఆపై మైదా, బేకింగ్‌పౌడర్ కూడా వేసి బాగా కలపాలి.
చివరగా ఫైనాపిల్ ఎసెన్స్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కేకు గిన్నెలో పోసి.. 210 డిగ్రీల సెంటీగ్రేడు వద్ద మైక్రోవేవ్ ఓవెన్‌లో బేక్ చేయాలి. లేదా ఈ గిన్నెను కుక్కర్‌లో పెట్టి సిమ్‌లో ఓ ఇరవై నిమిషాలు ఉంచినా కేకు తయారవుతుంది. ఇలా తయారయిన కేకును బయటకు తీసి బోర్లించి ముక్కలుగా కోస్తే... ఫైనాపిల్ అప్‌సైడ్ డౌన్ కేక్ రెడీ అయినట్లే...!