కావలసిన పదార్థాలు :
ఫైనాఫిల్ ముక్కలు... 20
మైదా... రెండు కప్పులు
ఉప్పు... తగినంత
కార్న్‌ఫ్లోర్... నాలుగు టీ.
తేనె... ఆరు టీ.
పచ్చికొబ్బరి తురుము... ఒక కప్పు
ఫైనాఫిల్ ఎసెన్స్... ఒక టీ.
పంచదారపొడి... ఆరు టీ.
నూనె... వేయించేందుకు సరిపడా
తయారీ విధానం :
ఫైనాఫిల్‌ను శుభ్రంచేసి రెండంగుళాల పొడవుగా ముక్కలు చేయాలి. ఈ ముక్కలలో పంచదార పొడి వేసి కలిపి పక్కనుంచాలి. మరో గిన్నెలో మైదా, ఉప్పు, కార్న్‌ఫ్లోర్‌లను వేసి తగినంత నీరు పోసి గట్టిగా కలపాలి. ఇలా కలిపిన పిండిని వెంటనే చిన్న బాల్స్‌లాగా చేసి పూరీలుగా పలుచగా వత్తాలి.
ఈ పూరీ మధ్యలో ఫైనాఫిల్ ముక్క పెట్టి మడతలు వేసి రెండు చివర్లలో చాక్లెట్ కవర్లలాగా మెలితిప్పాలి. ఇలా చేసుకున్న వాటిని బాగా మరుగుతున్న నూనెలో వేసి బంగారు వర్ణం వచ్చేదాకా వేయించి తీసేయాలి. అంతే క్రిస్పీ ఫైనాఫిల్ రోల్స్ రెడీ..! వీటిని అందంగా ప్లేట్లో సర్ది వాటిపై తేనె, ఎసెన్స్ కలిపిన కొబ్బరితురుమును సమంగా అమర్చాలి. సర్వ్ చేసేటప్పుడు ఫైనాఫిల్ ముక్కలతో గార్నిష్ చేస్తే సరి...!!