కావలసిన పదార్థాలు :
తర్భూజా ముక్కలు... నాలుగు కప్పులు
యాలకుల పొడి... ఒక టీ.
ఐస్ క్యూబ్స్... తగినన్ని
పంచదార... పావు కప్పు
నిమ్మరసం... రెండు టీ.
పుదీనా... తగినంత
ఉప్పు... చిటికెడు
తయారీ విధానం :
తర్భూజా ముక్కలు, యాలకుల పొడి, పంచదార, నిమ్మరసం, ఉప్పు... అన్నింటినీ తీసుకుని మిస్కీ బ్లెండర్లో వేసి అరగ్లాసు నీళ్ళుపోసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ మిశ్రమాన్ని గ్లాసుల్లో పోసి, తగినన్ని ఐస్ క్యూబ్స్ వేసి, పైన పుదీనాతో అలంకరించి సర్వ్ చేయాలి. అంతే మెలన్ పన్హా రెడీ అయినట్లే...! దాహాన్ని తగ్గించి, ఆరోగ్యాన్ని అందించే మెలన్ పన్హా అతిథుల చేత వహ్వా అనిపించుకోకమానదు సుమా...!