వేసవి కాలంలో ఎండతీవ్రతను తట్టుకోవాలంటే పిల్లలకు చల్లని దుస్తులు ధరింపజేయాలి. అందునా ప్రస్తుతం శుభకార్యాలుకూడా ఎక్కువగా వస్తున్నాయి. దీనికోసం పిల్లలకు సిల్కులాంటి అతి విలువైన దుస్తులు ధరింపజేస్తాం. దీంతో పిల్లల్లో చర్మ సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కాబట్టి పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు మృదువైన నూలు దుస్తులను ఎంపిక చేసుకుని వారికి ధరింపజేయాలి. ఇవి పిల్లల శరీరానికి అంటుకున్నాకూడా చల్లదనాన్ని ఇస్తాయి. వేసవిలో నిత్యం నూలు దుస్తులు వాడితే ఆరోగ్య పరంగా శుఖవంతంగా ఉండటమే కాకుండా మనసుకు కూడా ఉల్లాసంగా ఉంటుంది.