వేసవి కాలంలో పిల్లలు ఎక్కువగా తిరుగడం, ఆడుకోవడంలాంటివి చేస్తుంటారు. అలాగే దూరప్రయాణాలకుకూడా తల్లిదండ్రులు వారిని తీసుకు వెళుతుంటారు. అలాంటి సందర్భంలో కేవలం తల్లిదండ్రులే వారి కళ్ళకు చల్లని కళ్ళద్దాలు వాడుతుంటారు. ఇలాగే
పిల్లలకుకూడా కళ్ళ రక్షణ కొరకు వారికి చల్లటి కంటి అద్దాలను కొని ఇస్తే పిల్లలు ఆనందంగా వాటిని ధరిస్తారు. దీంతో వారి కళ్ళకు రక్షణలాగానే కాకుండా, వారికి అందంగా కూడా ఉంటుంది. ఇలాంటి సందర్భంలో కాస్త మెరుగైన కళ్ళద్దాలు కొనివ్వడం మంచిది.