ఎండాకాలం వచ్చిందంటే పిల్లలకు ఆటవిడుపు, మహా సరదాగా ఉంటుంది. సెలవులు కాబట్టి పిల్లల తల్లిదండ్రులుకూడా వారిని కోప్పడరని పిల్లలుకూడా చాలా అల్లరిగా మారాం చేస్తూ...విపరీతమైన అల్లరి చేస్తుంటారు. వారికి ఇదో మహా సరదా. కాని వచ్చిన చిక్కల్లా ఒకటే...అదేంటంటే!
పిల్లలు వేసుకున్న దుస్తులు త్వరగా మాపేస్తుంటారు. వాటిని ఉతకలేక తల్లులు సతమతమౌతుంటారు. పైగా వారిపై కోపాలు, తిట్లదండకం మొదలుపెడుతుంటారు. ఇలాంటి సందర్భంలో తల్లులు పిల్లలకు ధరింపజేసే దుస్తుల్లో లేత రంగుల కన్నాకూడా ముదురు రంగులున్న బట్టలు ధరింపజేస్తే వారు బాగా మాపినాకూడా అవి మాసినట్లు కనపడదు. ముదురు రంగు దుస్తులైతే త్వరగా మురికి కనిపించదు. దీంతో పిల్లలను తిట్టాల్సిన పని తప్పుతుంది.