సహజంగా పిల్లలు పక్క తడుపుతుంటారు. అది వారి తప్పు కాదు. వారిలో మానసిక ఒత్తిడి కారణంగా, అభద్రతా భావంతో ఇలా జరుగుతుంటుంది. వీటితోబాటు పుట్టుకతో వచ్చే జన్యుపరమైన కారణాలు, వారసత్వ మూలాలు ఈ సమస్యకు ఓ కారణం అంటున్నారు వైద్యులు.
ఈ సమస్యనుంచి వారిని బయట పడేయడానికి తల్లిదండ్రులు సతమతమౌతుంటారు. సాయంత్రం ఏడుగంటల తర్వాత ఆహారంలో ద్రవ పదార్థాలు ఇవ్వకుండా కట్టడి చేయండి. రాత్రి వేళ పక్క తడుపుతుంటే ఆ సమయానికి వారిని నిద్ర లేపి వారిని బాత్రూమ్‌కు పంపించండి. ఇలా అలవాటు చేస్తే వారిలో మార్పు సంభవించి పక్క తడిపే అలవాటును మానుకుంటారని వైద్యులు అంటున్నారు.