Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఆహ్లాదకరంగా.. ఆలోచింపజేసేలా సాగిన ప్రపంచ కవి సమ్మేళనం!

ఆహ్లాదకరంగా.. ఆలోచింపజేసేలా సాగిన ప్రపంచ కవి సమ్మేళనం!
, సోమవారం, 22 డిశెంబరు 2014 (19:50 IST)
చెన్నై నగరంలో ప్రపంచ కవి సమ్మేళనం ఆహ్లాదకరంగా, ఆలోచింపజేసేలా సాగింది. సమానత్వం, సౌభ్రాతృత్వం, స్త్రీవాదం, మానవీయం, ప్రకృతివాదం, భాషాభిమానం ఇలా అన్ని అంశాలను స్పృశిస్తూ ఈ కవి సమ్మేళనం చెన్నై నగరంలో శనివారం జరిగింది. దీన్ని వరల్డ్ పొయెట్రీ సొసైటీ, న్యూఢిల్లీకి చందిన భారత్ సోఖా గోకయ్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించాయి. ఇందులో తెలుగుతో పాటు.. ఆంగ్లం, తమిళం, హిందీ భాషలకు చెందిన అనేక మంది కవులు పాల్గొన్నారు. 
 
మిజోరాం మాజీ గవర్నర్ డాక్టర్ ఏ పద్మనాభన్ ముఖ్య అతిథిగా విచ్చేసి ఈ కవి సమ్మేళనాన్ని విజయవంతం చేశారు. ఇందులో తొలుత ప్రముఖ కవి ప్రొఫెసర్ సయ్యద్ అమీరుద్దీన్ రచించిన రెయిన్‌బో రాఫ్పోడిస్ అనే ఆంగ్ల కవితా సంకలనాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని డాక్టర్ పద్మనాభన్ ఆవిష్కరించి రచయితకు అభినందలు తెలిపారు. 
 
ఆ తర్వాత ప్రారంభమైన కవి సమ్మేళనంలో సుమారు 60 మంది వరకు కవులు పాల్గొన్నారు. తెలుగు విభాగంలో డాక్టర్ ఉప్పలధడియం వెంకటేశ్వర తెలుగు వర్షంలో నగరం అనే అంశంపై కవితను చదివి వినిపించగా, బషీర్ పెషావర్ సైనిక పాఠశాలపై జరిగిన దాడి ఘటనపై తన కవితను చదివి వినిపించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆకాష్ ఔచి, డాక్టర్ జాయ్, డాక్టర్ చెల్లప్పన్‌తో పాటు సేతుకుమరన్‌ విద్యా సంస్థలకు చెందిన విద్యార్థుల అధిక సంఖ్యలో హాజరయ్యారు. 

Share this Story:

Follow Webdunia telugu