Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చెన్నై టెక్కీ హత్య: కాపుకాసి పీక కోసిన మాజీ ప్రియుడు.. తండ్రి వెళ్లిన 2 నిమిషాలకే.. ఎగ్జిబిషన్‌లో వస్తువులా చూశారు!

చెన్నై టెక్కీ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు.

చెన్నై టెక్కీ హత్య: కాపుకాసి పీక కోసిన మాజీ ప్రియుడు.. తండ్రి వెళ్లిన 2 నిమిషాలకే.. ఎగ్జిబిషన్‌లో వస్తువులా చూశారు!
, శనివారం, 25 జూన్ 2016 (11:44 IST)
చెన్నై టెక్కీ మర్డర్ కేసులో పలు కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఆ కోణంలోనే పోలీసులు విచారణ జరుపుతున్నారు. టెక్కీని స్టేషన్‌లో తండ్రి వదిలి వెళ్లిన 2 నిమిషాలకే హత్యకు గురికాగా, మృతదేహాన్ని ఎగ్జిబిషన్‌లో వస్తువులా వచ్చిపోయే ప్రయాణికులు చూస్తూ వెళ్లడం అత్యంత విషాదకరం. 
 
చెన్నై మహానగరంలో నిత్యం అత్యంత రద్దీగా ఉండే నుంగంబాక్కం రైల్వే స్టేషన్‌లో శుక్రవారం ఉదయం 7.30 గంటల ప్రాంతంలో ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పని చేసే స్వాతి (25)ను ఓ గుర్తుతెలియని దుండగుడు (మాజీ ప్రియుడు) పీక కోసి చంపేసిన విషయం తెల్సిందే. అయితే, ఈ హత్య జరగడానికి స్వాతి తన తండ్రి గోపాలకృష్ణన్‌తో కలిసి స్టేషన్‌కు వచ్చింది. 
 
పక్కనే ఉన్న చూలైమేడు నుంచి తండ్రి ప్రతి రోజూ ఉదయం 6.30 గంటలు స్వాతిని తన ద్విచక్రవాహనంపై స్టేషన్‌కు తీసుకొచ్చి వదిలి వెళుతుంటారు. అలాగే, శుక్రవారం కూడా స్టేషన్‌కు తీసుకొచ్చి వదిలి వెళ్లిన రెండు నిమిషాలకే స్వాతి దారుణ హత్యకు గురైంది. ముందస్తుగా రూపొందించుకున్న పథకం ప్రకారమే దుండగుడు ఈ హత్యకు పాల్పడినట్టు పోలీసులు భావిస్తున్నారు.
 
కుమార్తె మరణ వార్త విన్న తండ్రి గోపాలకృష్ణన్ పరుగుపరుగున స్టేషన్‌కు వచ్చి కుమార్తె విగతజీవిగా పడివుండటాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. ఆయనను ఓదార్చడం ఎవ్వరితరం కాలేదు. ఎంతో గాబారంగా పెంచుకున్న కుమార్తెను రక్తపుమడుగులో చూసిన ఆయన కన్నీరుమున్నీరయ్యారు. నిత్యం రద్దీగా ఉండే స్టేషన్‌లో హత్య జరిగినా.. మృతదేహాన్ని మార్చురీకి తరలించడంతో తీవ్ర జాప్యం జరిగింది. దీంతో స్వాతి మృతదేహాన్ని ప్రతి ఒక్కరూ ఎగ్జిబిషన్‌లో వస్తువులా చూస్తూ వెళ్లడం అత్యంత బాధాకరం. మరోవైపు.. నిందితుడిని ఊహాచిత్రాన్ని పోలీసులు విడుదల చేశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బ్రెగ్జిట్ వల్ల మన దేశానికి లాభమేనట.... ఇంగ్లాండుకు పీకల్లోతు కష్టాలు...