Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

పోలీసులకు ఫోర్టిస్ మలర్‌లో ఉచిత వైద్యపరీక్షలు!

పోలీసులకు ఫోర్టిస్ మలర్‌లో ఉచిత వైద్యపరీక్షలు!
, శనివారం, 11 ఏప్రియల్ 2015 (19:59 IST)
చెన్నై నగరంలోని ప్రముఖ కార్పొరేట్ ఆస్పత్రి ఫోర్టిస్ మలర్ వైద్యశాల అడయార్ జిల్లా పరిధిలోని పోలీసు ఉన్నతాధికారులకు ఉచిత హృద్రోగ వైద్య పరీక్షల శిబిరాన్ని శనివారం నిర్వహించింది. ఈ వైద్య శిబిరాన్ని అడయారు జిల్లా డిప్యూటీ పోలీసు కమిషనర్ డి కణ్ణన్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి సేల్స్ అండ్ మార్కెటింగ్ విభాగం యూనిట్ హెడ్ అశోక్ త్యాగరాజన్, ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి ఇంటెన్సివిస్ట్ డాక్టర్ పాటురాజన్‌ ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 
ఈ వైద్య శిబిరాన్ని బేసంట్ నగర్‌లోని కమ్యూనిటీ హాలులో నిర్వహించగా, ఇందులో సుమారు 130 మంది వరకు పోలీసు ఉన్నతాధికారులు పాల్గొని వివిధ రకాల వైద్య పరీక్షలు చేయించుకున్నారు. వీరికి బ్లడ్ షుగర్, బ్లడ్ ప్రసర్, ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ తదితర పరీక్షలు చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ కమిషనర్ డి కణ్ణన్ మాట్లాడుతూ... ఈ తరహా వైద్య పరీక్షలు చేసిన ఫోర్టిస్ మలర్ ఆస్పత్రి యాజమాన్యాన్ని ప్రత్యేకంగా అభివనందిస్తున్నట్టు చెప్పారు. 
 
అనంతరం డాక్టర్ పాటురాజన్ మాట్లాడుతూ ఎక్కువ పని గంటలు, సమయానికి భోజనం చేయలేక పోవడం, ఒత్తిడి, ఇతర కారణాల వల్ల బ్లడ్ ప్లజర్, డయాబెటీస్ వంటి వ్యాధులు సోకి.. హృద్రోగానికి దారితీస్తుందని తెలిపారు. ఈ వైద్య శిబిరంలో హై కొలెస్ట్రాల్ లెవల్స్, బ్లాక్స్, హై బ్లడ్ షుగర్, బ్లడ్ ప్లజర్ వంటిని తనిఖీ చేసినట్టు చెప్పారు. ప్రతి యేడాది ఇదే తరహా వైద్య శిబిరాలను అనేకం ఫోర్టిస్ మలర్ ఏర్పాటు చేస్తోందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. ఈ తరహా శిబిరాల వల్ల కేవలం వైద్య పరీక్షలు చేయడమే కాకుండా, ప్రతి ఒక్కరిలో అవగాహన కల్పిస్తున్నట్టు చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu