Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

వీడియోగ్రాఫర్ లేడని పెళ్ళి పీటలపై ఆగిపోయిన పెళ్ళి.. వధువు లేచెళ్లిపోయింది..!

సాధారణంగా మనము ఎక్కువగా కట్నం గురించి లేదంటే బాల్య వివాహం, గొడవలు ఇలా అనేక కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి అని వింటుంటాం. అయితే ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. వీడియోగ్రాఫర్ లేకపోవడంతో పెళ్ల

వీడియోగ్రాఫర్ లేడని పెళ్ళి పీటలపై ఆగిపోయిన పెళ్ళి.. వధువు లేచెళ్లిపోయింది..!
, సోమవారం, 27 జూన్ 2016 (13:11 IST)
సాధారణంగా మనము ఎక్కువగా కట్నం గురించి లేదంటే బాల్య వివాహం, గొడవలు ఇలా అనేక కారణాలతో పెళ్లిళ్లు ఆగిపోతూ ఉంటాయి అని వింటుంటాం. అయితే ఇక్కడ మాత్రం దీనికి భిన్నంగా జరిగింది. వీడియోగ్రాఫర్ లేకపోవడంతో పెళ్లి ఆగిపోవడం అందరికీ నవ్వు తెప్పిస్తోంది. ఈ వింత ఘటన తమిళనాడు రాష్ట్రంలోని తిరుచ్చి జిల్లా తురైయూర్‌లో జరిగింది. పెళ్లి మండపం బంధుమిత్రులతో కళకళలాడుతోంది. ముహుర్తం సమయం దగ్గరపడుతోంది. అందరూ ఆ శుభఘడియ కోసం ఎదురుచూస్తున్నారు. తల వంచి తాళి కట్టించుకోవాల్సిన వధువు ఒక్కసారిగా పెళ్లి పీటలపై నుంచి లేచి వెళ్లిపోయింది. దీనికి కారణం పెళ్లి తతంగాన్ని వీడియోగా చిత్రీకరించాల్సిన వీడియో గ్రాఫర్‌ లేకపోవడమే.
 
పూర్తి వివరాలను పరిశీలిస్తే... సెంథిల్‌కు తన బంధువు కుమార్తెతో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి కోసం సెంథిల్ కుటుంబ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారు. ముహూర్త సమయం దగ్గర పడుతుండడంతో వధూవరులిద్దరూ మండపాన్ని చేరుకున్నారు. పెళ్లి వేడుకను ఓ ఫోటోగ్రాఫర్ మాత్రమే కవర్ చేస్తుండటంతో వధువు తండ్రి, ఇద్దరు కొడుకులకు.. వీడియో గ్రాఫర్ ఎక్కడ అనే అనుమానం వచ్చింది. దీంతో వధువు తండ్రి వద్ద వీడియోగ్రాఫర్ గురించి నిలదీశారు. ఖర్చులు అధికంగా ఉందని... అందుకే పెట్టలేదని సమాధానం చెప్పాడు. దీంతో ఇరుకుటుంబాల మధ్య గొడవలు చోటుచేసుకున్నాయి. 
 
అంతటితో ఆగక వధువును తీసుకుని కల్యాణమండపం నుంచి వెళ్లిపోయారు. దీంతో అప్పటి వరకు సందడి సందడిగా ఉన్న పెళ్లి మండపం ఒక్కసారిగా బోసిపోయింది. ఈ ఘటనపై వరుడు సెంథిల్ కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. వారు తమను చీటింగ్ చేశారని, అనవసరంగా తమ డబ్బులు వృథా అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనపై ఎలా స్పందించాలో తెలీక పోలీసులు తలపట్టుకుంటున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హత్య చేసినవాడెవడో....? మా బంగారు తల్లి గురించి పిచ్చి రాతలు రాయొద్దు... చెన్నై టెక్కీ స్వాతి అంకుల్...