Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

చంద్రుడిని ముద్దాడిన త్రివర్ణ పతాకం

చంద్రుడిని ముద్దాడిన త్రివర్ణ పతాకం
, శుక్రవారం, 14 నవంబరు 2008 (23:39 IST)
శుక్రవారం.. భారత కాలమానం ప్రకారం సరిగ్గా రాత్రి 8.31 నిమిషాలు. భారత అంతరిక్ష ప్రయోగ చరిత్రలో నిరుపమాన ఘట్టం.. చంద్రుడిపై మువ్వన్నెల పతాకం జాబిలిని ముద్దాడింది. అక్టోబర్ 22న చంద్రుడిపైకి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో ప్రయోగించిన చంద్రయాన్-1 నౌక లక్షలాది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి కక్ష్యలన్నీ దాటి ఈ శుభరాత్రి వేళ చందమామపైకి నిర్మలంగా అడుగు పెట్టింది.

అంతరిక్షంలో భూమికి అత్యంత చేరువగా ఉన్న జాబిలి దక్షిణ ధ్రువంపై మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ -ఎంఐపి- విజయవంతంగా దిగిన చారిత్రక క్షణాలు భారత జాతిని పరవశింపజేశాయి. ఈ మహత్తర ఘట్టం ఆవిష్కరణతో చంద్రుడి ఉపరితలాన్ని స్పర్శించిన నాలుగో దేశంగా భారత్ చరిత్రకెక్కింది.
చంద్రయాన పతాకం..
  లక్షలాది కిలోమీటర్ల సుదీర్ఘ ప్రయాణాన్ని విజయవంతంగా ముగించి కక్ష్యలన్నీ దాటి చందమామపైకి అడుగు పెట్టిన చంద్రయాన్-1 నౌకలోని ఎంఐపి పేలోడ్ భారతీయ త్రివర్ణ పతాకాన్ని చంద్ర ఉపరితలంపై సుతారంగా హత్తింది. భారతీయ సాంకేతికాభివృద్ధికి ఇది మంగళ నీరాజనం...      


భారత కీర్తిని విశ్వవ్యాప్తంగా చాటిన ఓ మహత్తర ఘట్టానికి ఈ శుక్రవారం రాత్రి చందమామ వేదికగా నిలిచింది. చంద్రయాన్ నౌక నుంచి ఎంఐపీ రోబో విజయవంతంగా వేరుపడి చంద్రుడి ఉపరితలంపైకి చేరింది. ఈ రోబోకు ఇరువైపుల త్రివర్ణ పతాకం అమర్చారు. రోబోపై సంస్కృత శ్లోకాన్ని లిఖించారు. ఈ ప్రక్రియలో మొదట మువ్వన్నెల పతాకం చంద్రుడి ఉపరితలాన్ని ముద్దాడింది.

ఈ రోబోలో అమర్చిన వీడియో చంద్రుడిపై సమాచారాన్ని ఇస్రోకు చేరవేస్తుంది. రోబోలోని సాంకేతిక పరికరాలు చంద్రుడిపై వాతావరణ పరిస్థితులను అంచనా వేసి ఇస్లోకు చేరవేస్తుంది. దీనితో చంద్రుని స్థితిగతులు అర్థం చేసుకుని భవిష్యత్ ప్రయోగాలకు ఈ ప్రయోగం మార్గదర్శనం చేస్తుంది.

చంద్రుని ఉపరితలంపై దిగి 20 నిముషాలపాటు ఉండే ఈ ఎంఐపి రోబో చంద్రుని ఉపరితలాన్ని ఫోటోలు తీసి భూమికి చేరవేస్తుంది. చంద్రుడిపై భారతీయ మొట్టమొదటి మానవరహిత ఉపగ్రహ మిషన్ అయిన చంద్రయాన్-1లో ఉంచిన 11 పేలోడ్‌లలో ఎంఐపి ఒకటి. చంద్రయాన్-1 గురువారం తన చిట్ట చివరి చంద్ర కక్ష్యను చేరుకుంది. చంద్రుడి ఉపరితరానికి వంద కిలోమీటర్ల దూరంలో చంద్రయాన్‌ను నిలబెట్టడంలో ఇస్రో శాస్త్రజ్ఞులు అపూర్వ విజయం సాధించారు.

Share this Story:

Follow Webdunia telugu