Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

విద్యార్థినుల కోసం రంగా వర్శిటీలో హోమ్‌సైన్స్ కోర్సులు

విద్యార్థినుల కోసం రంగా వర్శిటీలో హోమ్‌సైన్స్ కోర్సులు
, మంగళవారం, 19 మార్చి 2013 (18:11 IST)
File
FILE
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థినులకు నాలుగు సంవత్సరాల బీఎస్సీ (ఆనర్స్) హోమ్‌సైన్స్ కోర్సు అందిస్తోంది. విద్యార్థినీ విద్యార్థుల కోసం బీఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్ కోర్సు, బీఎస్సీ ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సులను ప్రవేశపెట్టింది. ఈ సంవత్సరం నుంచి గుంటూరులో బీఎస్సీ హోమ్‌సైన్స్ కళాశాలను నూతనంగా ప్రారంభిస్తున్నట్లు సైఫాబాద్‌లోని గృహ విజ్ఞాన కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ అనురాగ్ చతుర్వేది తెలిపారు.

బీఎస్సీ (ఆనర్స్) హోమ్‌సైన్స్ కోర్సులో చేరదలచుకున్న విద్యార్థినులు ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణులై ఉండాలి. నాలుగేళ్లలో 8 సెమిస్టర్లుంటాయి. దీనిలో 120 మంది విద్యార్థినులను చేర్చుకుంటారు. ఆచార్య ఎన్.జీ.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ కోర్సు సైఫాబాద్‌లోని హోమ్‌సైన్స్ కళాశాలలో ఉంది. 1964 నుంచి రంగావర్సిటీ హోమ్ సైన్స్ కోర్సు నిర్వహిస్తోంది. ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా సీట్లను భర్తీ చేస్తారు.

ఈ నాలుగేళ్ల హోమ్‌సైన్స్ కోర్సులో ఫుడ్స్ అండ్ న్యూట్రిషన్, ఫ్యామిలీ రిసోర్స్ మేనేజ్‌మెంట్, హోమ్‌సైన్స్ ఎక్స్‌టెన్షన్ అండ్ కమ్యూనికేషన్ మేనేజ్‌మెంట్, హ్యూమన్ డెవలప్‌మెంట్ అండ్ ఫ్యామిలీ స్టడీస్, టెక్స్‌టైల్స్ అండ్ అపెరల్ డిజైనింగ్ సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. నాలుగేళ్ల కోర్సులో మొదటి రెండేళ్లు విద్యార్థినులందరూ ఈ 5 సబ్జెక్టులను తప్పనిసరిగా చదవాలి. రెండేళ్ల తర్వాత వారు ఎంచుకున్న కోర్సులో స్పెషలైజేషన్ ఉంటుంది.

ఇంటర్మీడియట్ మార్కుల ఆధారంగా హోంసైన్స్ కళాశాలలో అడ్మిషన్లు కల్పిస్తారు. అధిక మార్కులు వచ్చిన వారికి ప్రాధాన్యమిస్తారు. జూన్, జులై మాసాల్లో నగరంలోని సైఫాబాద్‌లో ఉన్న హోమ్‌సైన్స్ కళాశాలలో ఎంపిక చేస్తారు. అయితే, ఈ కోర్సులో చేరే సమయంలో రూ.11,500 నుంచి రూ.12 వేల వరకు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రతి సెమిస్టర్‌కు రూ.11 వేల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థినులకు పరిశ్రమల్లో డైటీషియన్లుగా, న్యూట్రీషియన్ కన్సల్టెన్సీగా, ఛైల్డ్ డెవలప్‌మెంట్ అసోసియేట్స్‌గా, ఛైల్డ్ కేర్ ప్రొఫెషనల్స్‌గా, డెవలప్‌మెంటల్ స్పెషలిస్టులుగా, ఐసీడీఎస్ ప్రాజెక్టు అధికారులుగా, జర్నలిస్టులుగా, డిజైనర్స్ ఇన్ అపెరల్ ఇండస్ట్రీస్‌గా, శ్యాంపిల్ మేకింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఇన్‌ఛార్జులుగా, క్యాడ్ ప్రొఫెషనల్స్‌గా ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి.

Share this Story:

Follow Webdunia telugu