Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐఏఎస్.. ఐపీఎస్ కోర్సులకు.. యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ!

ఐఏఎస్.. ఐపీఎస్ కోర్సులకు.. యూపీఎస్సీ నోటిఫికేషన్ జారీ!
, బుధవారం, 6 మార్చి 2013 (18:01 IST)
File
FILE
దేశంలో అత్యున్నత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ ఉద్యోగ నియామకాల ప్రవేశ పరీక్ష కోసం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ యేడాది నిర్వహించే ఈ ప్రవేశ పరీక్షలో జనరల్ స్టడీస్, ఆప్టిట్యూడ్ స్కిల్స్‌కు అధిక వెయిటేజీ ఇవ్వనున్నారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పేపర్‌లో సాధించే మార్కులను కూడా సెలక్షన్ ఫైనల్ స్టేజ్‌లో కీలకంగా పరిగణించనున్నారు.

కొత్తగా ప్రవేశపెట్టిన సెక్షన్‌లో మొత్తం 250 మార్కులకు పేపర్ ఉంటుంది. ఇందులో అభ్యర్థుల మెదడుకు పని చెప్పే ఎన్నో చిక్కు ప్రశ్నలు, అప్రోచింగ్, ఇంటెగ్రిటీ, ప్రొబిటీ ఇన్ పబ్లిక్ లైఫ్, వివిధ అంశాలపై సమస్యల పరిష్కారం, సమాజం నుంచి ఎదురయ్యే అనేక క్లిష్ట పరిస్థితులు, వాటి నుంచి ఏ విధంగా గట్టెక్కాలి తదితర అంశాలపై ప్రశ్నపత్రాన్ని రూపొందించనున్నారు.

ఈ యేడాది ప్రిలిమినరీ పరీక్ష మే 26వ తేదీన పరీక్షలు నిర్వహిస్తారు. దరఖాస్తులను పంపేందుకు చివరి తేదీ ఏప్రిల్ 4గా ఖరారు చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్ పరీక్షలను మూడు దశలుగా విభజించారు. వీటిలో ప్రిలిమినరీ, మెయిన్స్, పర్సనాలిటీ టెస్ట్‌లుగా పరీక్షలు నిర్వహిస్తారు. అభ్యర్థులు ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Share this Story:

Follow Webdunia telugu