భారత బ్యాంకింగ్ వ్యవస్థపై లెమాన్ బ్రదర్స్ తరహా సంక్షోభం రాదని ఆర్బీఐ గవర్నర్ రఘురాం రాజన్ అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... దేశీయ ఎకానమీపై అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం పడకుండా త్రికోణ కంచెను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
మెరుగైన పాలసీలు, రుణ పరిణతికాలం పొడిగింపు, విదేశీ మారక రిజర్వుల పెంపు ద్వారా దేశ ఆర్థిక వ్యవస్థపై అంతర్జాతీయ సంక్షోభాల ప్రభావం పడకుండా ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేకాదు ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరించాలన్న వాదనను ఆయన తిరసర్కించారు.
భారత బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలోకి జారుకునే ప్రమాదం ఉందా అనే ప్రశ్నకు సమాధానమిస్తూ... ఇది అంత పెద్ద సమస్యేం కాదు. చాలా వరకు మొండిబకాయిలు ప్రభుత్వ రంగ బ్యాంకులకు చెందినవే. వాటికి ప్రభుత్వ గ్యారెంటీ ఉంటుంది. కాబట్టి మన బ్యాంకింగ్ వ్యవస్థ సంక్షోభంలోకి జారుకునే అవకాశమే లేదు. లెమాన్ తరహా ముప్పునకు ఏమాత్రం తావులేదన్నారు.