Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దుబాయ్‌కి చేరిన తాజ్ గ్రూప్ హోటల్స్: 296 గదుల లగ్జరీ హోటల్!

దుబాయ్‌కి చేరిన తాజ్ గ్రూప్ హోటల్స్: 296 గదుల లగ్జరీ హోటల్!
, మంగళవారం, 31 మార్చి 2015 (11:07 IST)
తాజ్ గ్రూప్ దుబాయ్‌లోకి ప్రవేశించింది. దేశంలోనే కాకుండా ఇతర దేశాల్లో హోటళ్లను నిర్వహిస్తున్న తాజ్ గ్రూప్ దుబాయ్‌లోనూ అడుగుపెట్టింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాకు అతి సమీపంలో ‘తాజ్ దుబాయి’ పేరిట కొత్త హోటల్‌ను ప్రారంభించింది.
 
సోమవారం లాంఛనంగా ప్రారంభమైన ఈ హోటల్‌లో 296 గదులు ఉన్నాయి. తాజ్ దుబాయితో తాజ్ గ్రూపులోని హోటళ్ల సంఖ్య 128కి చేరింది. ఇప్పటికే మాల్దీవులు, మలేషియా, బ్రిటన్, అమెరికా, భూటాన్, శ్రీలంక, ఆఫ్రికా, పశ్చిమాసియాలో తాజ్ గ్రూప్ హోటళ్లను కలిగి ఉంది.

Share this Story:

Follow Webdunia telugu