Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అమెరికా బాటలో సౌదీ అరేబియా... మా ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే

సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలోనే పయనించనుంది. ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకోసం విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేసి సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్

అమెరికా బాటలో సౌదీ అరేబియా... మా ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే
, మంగళవారం, 21 మార్చి 2017 (14:41 IST)
సౌదీ అరేబియా కూడా అమెరికా బాటలోనే పయనించనుంది. ఉద్యోగాలన్నీ స్వదేశీయులకే ఇచ్చేలా ఉత్తర్వులు జారీ చేయనుంది. ఇందుకోసం విదేశీ కార్మికులపై నిబంధనలు కఠినతరం చేసి సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. 
 
గత కొంతకాలంగా సౌదీలో నిరుద్యోగం పెరిగిపోతోంది. దీన్ని తగ్గించేందుకు ఆ దేశ పాలకులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం విదేశీ కార్మికుల విషయంలో నిబంధనలు మరింత కఠినతరం చేసి, విదేశీ కార్మికుల వలసలకు అడ్డుకట్ట వేసి... ఆ విధంగా సౌదీ పౌరులకు ఉద్యోగాలు కల్పించాలని భావిస్తున్నారు. 
 
ఈ కొత్త పాలసీ వల్ల సౌదీలో నిరుద్యోగం 2020 నాటికి 12.1 నుంచి 9 శాతానికి తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. దీంతో సౌదీ ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణల లక్ష్యం కూడా నెరవేరుతుందన్నది అధికారుల అంచనా. ఈ కొత్త నిబంధనల మేరకు 500 నుంచి 2,999 మంది ఉద్యోగులున్న కంపెనీలు టాప్‌ ‘ప్లాటినమ్‌’ కేటగిరీలో వంద శాతం సౌదీ పౌరులనే నియమించాల్సి ఉంటుంది. 
 
సౌదీలో తక్కువ వేతనాలకు, నిర్మాణ రంగంలో, ఇతర చిన్న చిన్న పనుల్లో లక్షలాది మంది విదేశీ కార్మికులు పనిచేస్తున్నారు. భారతీయులు, తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో సౌదీకి పనుల కోసం వెళ్తుంటారు. సౌదీ విదేశీ కార్మికుల విషయంలో కొత్త నిబంధనలు అమల్లోకి వస్తే విదేశీ కార్మికులపై తీవ్ర ప్రభావం పడుతుందని విదేశీ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సభకు హాజరుకాని బీజేపీ ఎంపీల భరతం పడతా : ప్రధాని మోడీ ఆగ్రహం