Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మోడీ సర్కారుతో డీల్ కుదరలేదు.. అందుకే నిష్క్రమిస్తున్నా : రఘురాం రాజన్

భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు అనేక రకాలైన చర్యలు చేపట్టిన ఆయన... మరో రెండు రోజుల్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆర్బ

మోడీ సర్కారుతో డీల్ కుదరలేదు.. అందుకే నిష్క్రమిస్తున్నా : రఘురాం రాజన్
, శుక్రవారం, 2 సెప్టెంబరు 2016 (12:22 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత ఆర్థిక రంగాన్ని గాడిలో పెట్టేందుకు అనేక రకాలైన చర్యలు చేపట్టిన ఆయన... మరో రెండు రోజుల్లో ఆ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. ఆర్బీఐ కొత్త బాస్‌గా ఉర్జిత్ పటేల్‌కు ఆ బాధ్యలను అప్పగించనున్నారు. 
 
ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్‌పై రఘురాం రాజన్ స్పందిస్తూ మరికొంత కాలం పాటు భారత్‌లోనే ఉండి సేవలందించాలని భావించానని, అయితే, నరేంద్ర మోడీ ప్రభుత్వంతో సరైన అగ్రిమెంట్ కుదరలేదన్నారు. "ఇక్కడ నేను చేయాలనుకున్న పని ఇంకా పూర్తి కాలేదు. అందుకే ఇంకొంత కాలం ఉండాలని అనుకున్నా. కానీ అందుకు తగ్గ చర్చలు సాగలేదు. ఇక ఆ విషయం ముగిసింది" అని అన్నారు. 
 
ఒక దశలో తనను మరో మూడేళ్ల పదవీ కాలానికి పొడిగించాలన్న ప్రతిపాదన సైతం వచ్చినప్పటికీ, అది ఆగిపోయిందని తెలిపారు. దేశంలో అసహనం పెరుగుతోందని గతంలో తాను చేసిన వివాదాస్పద ప్రసంగాన్ని సైతం రాజన్ సమర్థించుకున్నారు. అప్పటి పరిస్థితి అటువంటిదేనని తెలిపారు. తనకు అప్పగించిన బాధ్యతలను నిర్వహించానని, ఇక తిరిగి విద్యారంగంలోకి వెళ్లిపోతానని అన్నారు. తాను ఇండియాకు చేయాలని అనుకున్న కొన్ని పనులు మిగిలిపోవడం మాత్రం కొంత అసంతృప్తిని కలిగిస్తోందని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాష్‌రూమ్‌లో సీసీ టీవీ కెమెరా... విద్యార్థినిలు కాలకృత్యాలు తీర్చుకుంటుంటే...