Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఖతార్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం!

ఖతార్ ఎయిర్‌వేస్ బంపర్ ఆఫర్.. ఒకటి కొంటే మరొకటి ఉచితం!
, గురువారం, 30 అక్టోబరు 2014 (12:20 IST)
దేశంలోని ప్రైవేట్ విమానయాన సంస్థల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. దీంతో ఒకదాన్ని మించి మరొకటి ఉచిత ఆఫర్లను ప్రకటిస్తూ ప్రయాణికులను ఆకర్షించేందుకు తీవ్రంగా పోటీపడుతున్నాయి. ముఖ్యంగా భారత్‌లో స్పైస్ జెట్, జెట్ ఎయిర్‌వేస్, ఎయిరిండియా తదితర సంస్థలు టికెట్ల ధరల్లో భారీ డిస్కౌంట్ ప్రకటించి ప్రయాణికులను ఆకర్షిస్తున్నాయి. 
 
ఈ తరహాలో అంతర్జాతీయ విమానయాన సంస్థ ఖతార్ ఎయిర్ వేస్ కూడా వినూత్న ఆఫర్‌తో ముందుకొచ్చింది. ఒక బిజినెస్ క్లాస్ టికెట్ కొంటే మరో బిజినెస్ క్లాస్ టికెట్ ఉచితమంటూ ప్రకటించింది. ఇదే అంశంపై ఖతార్ ఎయిర్‌వేస్ భారత ఉపఖండం వైస్ ప్రెసిడెంట్ ఇనాబ్ సొరియల్ మాట్లాడుతూ, బిజినెస్ క్లాస్ ప్రయాణికులకు ఇదో అద్భుతమైన అవకాశమన్నారు. ఈ ప్రత్యేక టికెట్లను అక్టోబర్ 31 వరకే విక్రయిస్తారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు ఆఫర్ వర్తిస్తుంది. అయితే ఈ బంపర్ ఛాన్స్ కేవలం ఎంపిక చేసిన మార్గాల్లోనే చెల్లుతుందని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu