Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజన్ తొలగింపు పరిపాలనకు సంబంధించిన అంశం.. మీడియా వేలెట్టొద్దు : నరేంద్ర మోడీ

రాజన్ తొలగింపు పరిపాలనకు సంబంధించిన అంశం.. మీడియా వేలెట్టొద్దు : నరేంద్ర మోడీ
, శుక్రవారం, 27 మే 2016 (14:53 IST)
భారత రిజర్వు బ్యాంకు గవర్నర్ రఘురాం రాజన్‌ తొలగింపు అంశంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తొలిసారి స్పందించారు. రాజన్ తొలగింపు వ్యవహారం పరిపాలనకు సంబంధించిన అంశమని ఈ విషయంలో మీడియా అంతగా ఆసక్తిని చూపించొద్దని ఆయన సలహా ఇచ్చారు. 
 
దేశ ప్రయోజనాల రీత్యా ఆర్బీఐ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ను తక్షణమే ఆ పదవి నుంచి తొలగించాలని కోరుతూ బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ప్రధాని మోడీకి లేఖ రాశారు. 15 రోజుల వ్యవధిలోనే ప్రధానికి రాజన్‌పై రెండో లేఖ రాయడం గమనార్హం. తాజా లేఖలో రాజన్‌పై 6 ఆరోపణలు చేశారు. తన ఆరోపణలన్నిటికీ ప్రాథమిక ఆధారాలు ఉన్నందున.. రాజన్‌ను తొలగించాలని డిమాండ్‌ చేశారు. 
 
దీనిపై మోడీ పై విధంగా స్పందించారు. ఇది పరిపాలనకు సంబంధించిన అంశమని తెలిపారు. మీడియాకు అంతగా ఆసక్తి అనవసరమని అనుకుంటున్నట్టు వివరించారు. ఆయనకు ఇంకా సెప్టెంబర్ వరకూ సమయం ఉందని, ఈలోగా ఏదో ఒకటి చేద్దామని బదులిచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హ‌మ్మ‌య్య‌... జగన్ పార్టీలోకి జ‌నం వ‌స్తున్నారోచ్...