Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అనుష్క శర్మ ఖాతాలో కొత్త బ్రాండ్ : ప్యాంటీన్ వాడి చూశాకే డీల్ ఓకే చేసిందట!

అనుష్క శర్మ ఖాతాలో కొత్త బ్రాండ్ : ప్యాంటీన్ వాడి చూశాకే డీల్ ఓకే చేసిందట!
, మంగళవారం, 21 జులై 2015 (16:20 IST)
ప్రముఖ క్రికెటర్ విరాట్ కోహ్లీతో ప్రేమలో పడిన బాలీవుడ్ భామ అనుష్క శర్మ చేతిలో కొత్త బ్రాండ్ వచ్చింది. ఇప్పటికే పలు ఎఫ్ఎంసీజీ కంపెనీలకు ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న అనుష్క శర్మ.. కేశ సంరక్షణ ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తున్న 'ప్యాంటీన్' తమ ఉత్పత్తుల ప్రచారం కోసం డీల్ కుదుర్చుకుంది.
 
న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో సంస్థ ప్రతినిధులు, అనుష్క మీడియాతో మాట్లాడారు. తన బిజీ లైఫ్ కారణంగా అనేక రసాయనాలు, దుమ్ము, ధూళికి కురులు చెడిపోయిన విషయాన్ని గమనించానని అనుష్క శర్మ తెలిపింది. 
 
ఈ నేపథ్యంలో ప్యాంటీన్ వాళ్లు తమ బ్రాండ్ అంబాసిడర్‌గా రావాలని కోరినప్పుడు ఆ ఉత్పత్తులు తన కేశ సంరక్షణకు ఉపయోగపడతాయా అనే అనుమానం వచ్చిందని, అందుకే ముందుగా ఆ ఉత్పత్తుల్ని ఉపయోగించానని తెలిపింది. ముందుగా తాను ఆ ప్రాడెక్టులు వాడి చూసి సంతృప్తి చెందిన తరువాతనే, ప్రచారకర్తగా ఉండేందుకు ఒప్పుకున్నట్టు వివరించింది.

Share this Story:

Follow Webdunia telugu